చంద్రబాబు హయాంలోనే అరాచక పాలన: మంత్రి పెద్దిరెడ్డి

27 Aug, 2023 18:30 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడే అరాచక పాలన సాగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యర్థి పార్టీల నాయకులను చంపించిన చరిత్ర చంద్రబాబుదే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాజకీయ హత్యలు జరిగాయి. చంద్రబాబు ష్యూరిటీ ఇస్తానంటే జనం నవ్వుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

ప్రజలకు మంచి చేయడంలో సీఎం జగన్ కాలి గోటికి చంద్రబాబు సరిపొడు. ఏనాడైనా చంద్రబాబు ఇచ్చిన మాట అమలు చేశాడా. చంద్రబాబుని నమ్మితే మునిగిపోతారని ప్రజలకు తెలుసు’’ అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబు మేనిఫెస్టోకి గ్యారంటీ లేదు: ఎంపీ మిథున్‌రెడ్డి
దేశంలో ఏ సర్వే చూసిన ఏపీలో వై ఎస్సార్ కాంగ్రెస్‌దే విజయం అని చెబుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మాత్రం సీ ఓటర్ ప్రకటించని సర్వేని ప్రచారం చేసుకుంటున్నారు. బోగస్ సర్వే అంకెలతో చంద్రబాబు తృప్తి పడుతున్నారు. సీ ఓటర్ సర్వే నివేదికను ఎక్కడైనా ప్రకటించిందా..? చంద్రబాబు చూపించాలి. చంద్రబాబు ష్యూరిటీని ని జనం నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు మేనిఫెస్టోకి గ్యారంటీ లేదు’’ అంటూ  మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
చదవండి: సినిమా రేంజ్‌లో సీన్లు పండించిన పవన్‌.. ప్లాన్‌ బెడిసికొట్టింది!

మరిన్ని వార్తలు