‘జేసీ భూములు ఇప్పిస్తామనడం హాస్యాస్పదం’

27 Oct, 2020 14:01 IST|Sakshi

సాక్షి, తాడిపత్రి: మండలంలోని వంగనూరు, బొందలదిన్నె గ్రామంలోని భూములను రైతులు స్వచ్ఛందంగా విక్రయించారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం రైతులు తమ భూములు కొనుగోలు చేయవచ్చన్నారు. అయితే ఆ భూములను రైతులకు ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

 జేసీ ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసమే గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దొంగ లారీలు, దొంగ భూములు కొనుగోలు చేయడం కేవలం జేసీ సోదరులకు మాత్రమే చెందుతుందని విమర్శించారు. కర్ణాటక రవాణాశాఖ అధికారులు స్పందించకుండా ఉంటేనే లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం దివాకర్ ట్రావెల్స్ వారికే సాధ్యమని  ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు