తేలిపోయిన యువ గళం!.. పాదయాత్రకు స్పందన అంతంత మాత్రమే 

28 Jan, 2023 10:58 IST|Sakshi
వెలవెలబోతున్న సభాప్రాంగణం

కుప్పం రూరల్‌(చిత్తూరు జిల్లా): యువగళం పాదయాత్ర మొదటరోజే తేలిపోయింది. దాదాపు రెండు నెలలుగా ఆహా..ఓహో.. అంటూ ఊదరగొట్టినా జనాలను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. శనివారం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌  చేపట్టిన పాదయాత్రకు స్పందన అంతంతమాత్రంగా కనిపించింది.

ఆయన కుప్పంలోని లక్ష్మీపురం నుంచి పాదయాత్ర ప్రారంభించగా.. సాయంత్రం కమతమూరు సమీపంలో జరిగిన బహిరంగ సభ జనాలు లేక వెలవెలబోయింది. తమిళనాడు, కర్ణాటక నుంచి జనాలను తరలించినా ఫలితం లేకపోయింది.

సభాప్రాంగణం సగభాగం వరకు దాదాపు ఖాళీగా కనిపించింది. లోకేష్‌ బాబు ప్రసంగిస్తుండగా మధ్యలోనే జనం వెళ్లడం  చర్చనీయాంశమైంది. అడుగడుగునా యువగళం వలంటీర్లు జనాలపై విరుచుకుపడడం స్థానిక టీడీపీ కార్యకర్తలకు విసుగుపుట్టించింది. పాదయాత్ర మార్గంలోని రోడ్లపై చిరుదు కాణాలను కార్యకర్తలు తొక్కుకుంటూ వెళ్లడంతో వ్యాపారులు కన్నీళ్లు పెట్టుకున్నారు.  పలమనేరు–క్రిష్ణగిరి హైవేపై ట్రాఫిక్‌ గంటల తరబడి నిలిచిపోయింది.
చదవండి: ఎక్కడికక్కడ గొడవలకు దిగండి.. ఎలాగైనా సరే లోకేశ్‌ పాదయాత్రకు హైప్‌ తేవాలి.. బాబు కుయుక్తులు? 

మరిన్ని వార్తలు