కేసీఆర్‌కు‌ సంక్రాంతి గిఫ్ట్‌ కూడా ఇస్తారు

11 Nov, 2020 17:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజలు దుబ్బాక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దీపావళి  గిఫ్ట్‌ ఇచ్చారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సంక్రాంతి గిఫ్ట్‌ కూడా ఇస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.  ‘ బీజేపీ ఎక్కడ ఉందన్న కేసీఆర్‌కు ఇప్పుడే చెప్తున్నా.. నీ సొంత జిల్లాలో మా ఎమ్మెల్యే ఉన్నడు. ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. బుధవారం జూమ్‌ యాప్‌ ద్వారా ఆయన మాట్లాడుతూ.. ‘ ‘ తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారు.  ఫాం హౌస్‌‌లో దొడ్డు బియ్యం పండించి, రాష్ట్ర రైతులను సన్న బియ్యం పండించమని మోసం చేశారు. ఎల్ ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. ( కార్యకర్త ఆత్మహత్య.. పాడె మోసిన హరీశ్‌రావు )

పాతబస్తీలో పన్నులు ఎంత వసూలు చేస్తున్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పట్లేదు. రాష్ట్ర ఖజానాను పాతబస్తీలో ఖర్చు పెడుతున్నారు. ఓట్ల కొనుగోలు కోసమే పది వేల నగదు పంచుతున్నారు. లాక్ డౌన్‌తో ఏంతో మంది పేదల జీవితాలు నాశనం అయ్యాయి. వారిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. 2023లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. బీజేపీ అభ్యంతరాలను ఎన్నికల కమీషన్ పరిశీలించి, పరిష్కరించాలి. గ్రేటర్‌లో  బీజేపీ గెలవబోతుందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. హైదరాబాద్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వల్లే సాధ్యమయింద’’ని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు