కోటంరెడ్డి ఆరోపణలు.. పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌

2 Feb, 2023 14:29 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కోటంరెడ్డి ఫోన్‌ను ఆయన మిత్రుడే రికార్డ్‌ చేశాడని, దానిని ట్యాపింగ్‌ చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపణలపై స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

కోటంరెడ్డిది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదు.. రికార్డింగ్‌ అని, వీడియోతో పాటు టెక్ట్స్‌ మెసేజ్ కూడా ఉందన్నారు. కోటంరెడ్డి వాట్సాప్‌ కాల్‌ డేటా అంతా మీడియా ముందు పెట్టాలని పేర్ని నాని అన్నారు.

‘‘ఎమ్మెల్యేలపై నిఘా ఎందుకు ఉంటుంది?. డిసెంబర్‌ 25న చంద్రబాబును కోటంరెడ్డి కలిశారు. అంతకు ముందే లోకేష్‌తో టచ్‌లో ఉన్నారు. ఒక చోట పనిచేస్తూ.. పక్క చూపులు చూడటం సరికాదు. సీఎం జగన్‌కు కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు’’ అని పేర్ని నాని దుయ్యబట్టారు.
చదవండి: ఆనం రామనారాయణపై నేదురుమల్లి సీరియస్‌ కామెంట్స్‌

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు