పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంకా తగ్గించాలి

5 Nov, 2021 17:48 IST|Sakshi
కేసీ వేణుగోపాల్‌

కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్‌

ఎల్పీజీ ధరలు కూడా తగ్గించాలని డిమాండ్‌

బెంగళూరు: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇంకా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఎల్పీజీ ధరలు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయని, వాటిని కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కేంద్ర సర్కారు లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్‌డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్‌ స్పందించారు. 

శుక్రవారం ఆయన ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ...‘పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెద్దగా ఏం తగ్గించలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో లీటర్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌డ్యూటీ రూ.9.48, డీజిల్‌పై రూ.3.56 ఉండేది. ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని మరింత తగ్గించాలి. ఎల్పీజీ రేట్లు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి. వీటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. ధరలు తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తాం. నవంబర్‌ 14 నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామ’ని అన్నారు. (చదవండి: పంజాబ్‌ కాంగ్రెస్‌: నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కీలక నిర్ణయం)

కాగా, గతకొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వినియోగదారులు సతమతవుతున్నారు. చమురు ధరల అనూహ్య పెరుగుదలతో సామాన్యుడి జీవితం భారంగా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర సర్కారు స్వల్పంగా ఎక్సైజ్‌డ్యూటీ తగ్గించి వినియోగదారులకు ఊరట కల్పించింది. అయితే ఇంకాస్త తగ్గించాలని సామాన్యులు కోరుకుంటున్నారు. (వంటనూనె ధరల్ని తగ్గించిన కేంద్రం.. ఎంతంటే?)

మరిన్ని వార్తలు