‘పవన్‌ ఆ సమయంలో మందు కొట్టి పడుకున్నారా?’: పిఠాపురం ఎమ్మెల్యే

30 Sep, 2021 12:59 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, పిఠాపురం: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ఇలా మాట్లాడారు. ‘పవన్ నాయుడు.. మీరు ఇంకా సినిమా భాషని.. సొంత భాషని మరిచిపోయినట్లు లేరు. ఆల్ రెడీ మీరు పోటీ చేసిన రెండు నియోజకవర్గాలో ప్రజలు మీ తాట తీశారు. అయినా నీకు బలుపు తగ్గలేదు. ఆరు నెలలకొకసారి మీడియా ముందుకు వచ్చి.. నీ భాషలో మాట్లాడడం రాజకీయం కాదు’ అని హితవు పలికారు.
చదవండి: నయా దొంగలు సెల్‌ టవరే లక్ష్యం.. అక్కడ ఏముంటుందని అనుకోవద్దు 

‘కాపు ఉద్యమ సమయంలో మీరు చంద్రబాబుతో కలిసి సమ్మగా అంబలి తాగుతున్నారు. కాపులకు ఇచ్చిన హమీని అమలు చేయమని అడిగిన ముద్రగడను కుటుంబంతో సహా మోకాలితో తన్నారు. ఆవాళ మీరు ఏమయ్యారు. మందు కొట్టి పడుకున్నారా? ఇదేంటని చంద్రబాబును అడగాలని అనిపించలేదా? కాపు ఉద్యమంలో అందరికి ఆహ్వానం ఉంది. మీ అన్న చిరంజీవి వచ్చే ప్రయత్నం చేశారు. మరి నువ్వెందుకు రాలేదు’ అని ఎమ్మెల్యే దొరబాబు ప్రశ్నించారు.
చదవండి: ఏపీ టూ మహారాష్ట్ర వయా తెలంగాణ.. వీళ్ల తెలివి మామూలుగా లేదుగా

‘వైజాగ్ ప్రజలు ఓడించారని స్టీల్ ప్లాంట్ కోసం పోరాడను అని అంటున్నావ్. మరి మీ పార్టీని రాష్ట్ర ప్రజలంతా ఓడించారు. అలాంటప్పుడు రాష్ట్రం కోసం ఎందుకు మాట్లాడుతున్నావ్. అయ్యా పవన్ నాయుడు ఇప్పటికీ మీకు రాజకీయాల మీద అవగాహన.. పరిపక్వత లేదు. రాజకీయం అంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకో. కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలను పేదలకు అందించడాన్ని గుర్తించు. ఇవాళ కాపులను సీఎం ఎంతో గౌరవంగా చూస్తున్నారు’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు