వాళ్లకు కష్టాలు తెలియవు.. అందుకే ఎలాంటి అభివృద్ధి చేయలేదు:ప్రధాని

25 Sep, 2023 14:10 IST|Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ జన ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రచారాన్ని నిర్వహించగా ముగింపు సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వారికి మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అనారోగ్య రాష్ట్రంగా చేస్తారని ఆరోపించారు. 

బీజేపీ చలవే.. 
జన ఆశీర్వాద యాత్ర సందర్బంగా 'కార్యకర్తల మహాకుంభ' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కార్యక్రమంలో మొదట దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకోవాలని చెబుతూ ఆయనకు నివాళులర్పించిన ప్రధాని.. అనంతరం కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని మాట్లాడుతూ.. ఈరోజు మధ్యప్రదేశ్ ఇంతగా అభివృద్ధి చెందిందంటే అది మొదటిసారి యుక్కా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వల్లనే సాధ్యమైందన్నారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరు ఇంతటి అభివృద్ధిని చూడగలిగారంటే మీరంతా నిజంగా అదృష్టవంతులని అన్నారు. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలించింది కానీ ఇక్కడ ఏదీ అభివృద్ధి చేయలేకపోయిందని పైగా అవినీతిని పెంచి పోషించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని అన్నారు. 

తుప్పుపట్టిన ఇనుము.. 
యావత్ భర్త దేశం కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని అభినందిస్తుంటే వారు మాత్రం వ్యతిరేకించారు. అలాగే వారు మొదట్లో యూపీఐ చెల్లింపులను డిజిటల్ పేమెంట్లను కూడా వ్యతిరేకించారు. కానీ అదే ఈ రోజు దేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్షంలో పెడితే పాడైపోయే తుప్పు పట్టిన ఇనుములాంటి పార్టీ అని అవినీతిలో కూరుకుపోయిన వంశపారంపర్య పార్టీ అని అన్నారు. వచ్చే ఎన్నికలు చాలా కెలకమైనవని ఇక్కడి యువత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏంటో మార్పును చూశారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. 

బిల్లును అడ్డుకోలేకపోయారు.. 
మీ తల్లిదండ్రులు, తాతలు కాంగ్రెస్ పాలనలో చాలా సమస్యలను ఎదుర్కొన్నారని మారు మాత్రం ఆ తప్పు చేయవద్దని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ పార్ట్ ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వమని అన్నారు. మీకు మాటిచ్చినట్టుగానే పార్లమెంట్ సాక్షిగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం జరిగింది. దానికి ఆ కుయుక్తులు కూటమి కూడా ఆమోదించింది. వారి మనసు అంగీకరించకపోయినా ఈ చారిత్రాత్మక బిల్లును వారు ఆమోదించకుండా ఉండలేక పోయారని అన్నారు. 

వాళ్లకు తెలియదు.. 
వారంతా బాగా డబ్బున్న కుటుంబాల్లో పుట్టినవారు కాబట్టి వారికి పేదవాళ్ల కష్టాలు గురించి తెలియదు. అందుకే వారెప్పుడూ పేద వారిని పట్టించుకోలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో మీకు ఇచిన హామీలకు మోదీ గ్యారెంటీ ఉంటారని అన్నారు. తరాలుగా కాంగ్రెస్ పార్టీ తుంగలోకి తొక్కిన అభివృద్ధిని నేను వెలుగులోకి తీసుకొచ్చానని అన్నారు. 

ఇది కూడా చదవండి: మీరొక డమ్మీ సీఎం.. అందుకే పక్కన పెట్టేశారు

మరిన్ని వార్తలు