కొత్త, పాత మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్థేశం

8 Jul, 2021 18:12 IST|Sakshi
ఫైల్‌ పోటో

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మంత్రిత్వశాఖల కేటాయింపు తర్వాత తొలిసారిగా భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కొత్త, పాత మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుండగా.. మంత్రుల మండలి రాత్రి 7 గంటలకు సమావేశం కానుంది.

పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రధాన మంత్రి కేంద్ర మంత్రివర్గ సమావేశాలతో పాటు మంత్రుల మండలి సమావేశాలను జరపడం సర్వసాధారణం. నిన్న జరిగిన సమావేశంలో 15 మంది క్యాబినెట్ మంత్రులు, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఇక ఏడుగురు మంత్రుల క్యాబినెట్‌ ర్యాంకుకు పెంచారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో 43 మంది నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు