మోదీ రోజుకు ఏడు సార్లు నమాజ్ చేసేవారు.. కాంగ్రెస్ మహిళా నేత వ్యాఖ్యలపై దుమారం..

30 Aug, 2022 13:00 IST|Sakshi

జైపూర్‌: ప్రధాని నరేంద్ర మోదీపై రాజస్థాన్ కాంగ్రెస్ మహిళా నేత ఇంద్రా డూడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఝున్‌ఝునా జిల్లా సుల్తానాలో శనివారం ఓ ర్యాలీకి హాజరై ఆమె మాట్లాడిన మాటలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.  ఒక వేళ మన దేశంలో ముస్లింల జనాభా హిందువుల జనాభాతో సమానంగా ఉం‍డి ఉంటే.. మోదీ రోజుకు ఏడు సార్లు నమాజ్ చేసేవారని ఇంద్రా డూడీ అన్నారు. బీజేపీ దేశంలో విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంద్రా ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు రాజస్థాన్ రవాణా శాఖ మంత్రి బ్రిజేంద్ర ఓలా కూడా పక్కనే ఉన్నారు. ఇంద్రా వ్యాఖ్యలపై కమలం పార్టీ తీవ్రంగా స్పందించింది. హస్తం పార్టీనే బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తింది.
చదవండి: ఢిల్లీ అసెంబ్లీలో రగడ.. ఆప్, బీజేపీ నేతల మాటల యుద్ధం

మరిన్ని వార్తలు