వ్యాక్సిన్‌ ఫస్ట్‌ మోదీనే తీసుకోవాలి: కాంగ్రెస్‌

4 Jan, 2021 17:20 IST|Sakshi

పట్నా: కరోనా వైరస్‌ పని పట్టే వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ప్రపంచ దేశాలు తలమునకలయ్యి ఉన్నాయి. ఇప్పటికే స్పూత్నిక్‌ వి, ఫైజర్ బయోటెక్‌ వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మన దగ్గర కూడా డీసీజీఐ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఆదివారం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు డీసీజీఐ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత త్వరగా వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతివ్వడం సరైంది కాదని.. వ్యాక్సిన్‌ సామార్థ్యం పట్ల జనాల్లో సందేహాలున్నాయని తెలిపాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. (చదవండి: వచ్చే వారం నుంచీ మనకూ వ్యాక్సిన్‌! )

ఈ సందర్భంగా బిహార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అజీత్‌ శర్మ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనావైరస్‌ వ్యాక్సిన్కి అత్యవసర అనుమతివ్వడంతో.. ప్రజల్లో తలెత్తిన సందేహాలు తొలగించడానికి రష్యా, అమెరికా ప్రధానులు బహిరంగంగా తొలి డోస్‌ వ్యాక్సిన్‌ని తీసుకున్నారు. వారిలానే మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా కోవాగ్జిన్‌ తొలి డోస్‌ని జనం మధ్యలో తీసుకోవాలి. అప్పుడే వ్యాక్సిన్‌ పట్ల ప్రజల్లో నెలకొన్న సందేహాలు తొలగిపోతాయి’ అన్నారు. అంతేకాక మోదీతో పాటు మరి కొందరు సీనియర్‌ బీజేపీ నాయకులు తొలుత వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు