ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు

28 Oct, 2022 12:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అరెస్ట్‌ను ఏబీసీ కోర్టు రిజక్ట్‌ చేయడంపై సైబరాబాద్‌ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. మేజిస్ట్రేట్‌ తప్పుడు ప్రొసీజర్‌ను అనుసరించారని అభియోగం. ఇవాళ మధ్యాహ్నం హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది.
చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. జాతీయ మీడియా ముందుకు ఆధారాలు!

కాగా, ‘టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలో రెడ్‌ హ్యాండెడ్‌గా నగదు పట్టుబడనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు పంపాలంటూ పోలీసులు దాఖలు చేసిన రిపోర్టును తిరస్కరించారు. నిందితులను విడుదల చేయాలని.. వారికి సీఆర్పీసీ సెక్షన్‌ 41 ప్రకారం నోటీసులు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో నిందితులు కొనుగోలు సంప్రదింపులు జరిపిన ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని పోలీసులు విన్నవించినా దీనిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. 

మరిన్ని వార్తలు