తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌.. పొంగులేటి కొత్త పార్టీ?

6 May, 2023 08:28 IST|Sakshi

నేడు పొంగులేటితో భేటీ కానున్న నల్లగొండ జిల్లా నేత చకిలం   

తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో పొంగులేటి పార్టీ?  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ వ్యూహంపై నల్లగొండ జిల్లాలో చర్చ జోరందుకుంది. బీజేపీలో చేరతారా.. కాంగ్రెస్‌లో చేరతారా అన్న చర్చతో పాటు ఆయన సొంతంగా పార్టీ పెడతారన్న ప్రచారం ఇక్కడ జరుగుతోంది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్, ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలు పొంగులేటి శిబిరం టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

ఇటీవల బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన నల్లగొండ జిల్లా సీనియర్‌ నేత చకిలం అనిల్‌కుమార్‌కు ఆహ్వానం అందడంతో ఆయన నేడు(ఈ నెల 6న) ఖమ్మంలో పొంగులేటితో భేటీ కానున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటికి నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్‌ జిల్లాలతో నూ మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, పొంగులేటి బీజేపీలో చేరితే ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో ఆయన ప్రభావం చూపడం కష్టమేనని ఆయన అనుచరులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరినా కష్టమేనన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ రైతు సమాఖ్య (టీఆర్‌ఎస్‌)పేరుతో పార్టీ పెడతారన్న చర్చ సాగుతోంది. తద్వారా బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న ముఖ్యనేతలు, ఉద్యమంలో పనిచేసినా ప్రాధాన్యం దక్కని నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఇటీవల రాజీ నామా చేసిన చకిలంను పొంగులేటి బృందం చర్చలకు ఆహా్వనించిందని అంటున్నారు.   

ఇది కూడా చదవండి: ఎంపీగా నాలుగేళ్లు ఏం చేశాడో చెప్పే ధైర్యం లేదు: బండి సంజయ్‌పై కేటీఆర్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు