హైదరాబాద్‌లో మళ్లీ పోస్టర్‌ వార్‌.. అదే దారిలో బీజేపీ కౌంటర్‌

29 Mar, 2023 20:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరోసారి పోస్టర్ల కలకలం రేగింది. ఇప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ వాల్ పోస్టర్ల వార్‌కు తెర తీయగా.. ఇప్పుడు అదే దారిలో బీజేపీ కౌంటర్‌కు దిగింది. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఫ్లై ఓవర్‌కు బీజేపీ అతికించింది. ఈ క్రమంలో మళ్లీ పోస్టర్‌ రాజకీయం తెర మీదకు వచ్చింది.

ఉప్పల్‌-నారపల్లి ఫ్లై ఓవర్‌పై రచ్చ కొనసాగుతోంది. మొన్న మోదీ ఫొటోలతో ఫ్లై ఓవర్ పనులు సాగడం లేదని వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ జాప్యంపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు కొందరు వ్యక్తులు. ‘‘మోదీ గారు.. ఈ ఫ్లై ఓవర్ పనులు ఇంకా ఎన్నాళ్లు? తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’’ అని వెలిసిన పోస్టర్లు దారి పొడవునా ఏర్పాటు చేశారు.

కాగా, వాస్తవాలు తెలుసుకోవాలంటూ ఒక దిన పత్రికలో వచ్చిన వార్తతో వాల్‌ పోస్టర్‌ వెలిసింది. ఉప్పల్‌లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీవీఎస్‌ ప్రభాకర్ ర్యాలీ నిర్వహించి, ధర్నాకు దిగారు. ఫ్లై ఓవర్ పనుల ఆలస్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడమే కారణమని  బిజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు.
చదవండి: ‘మోదీగారు.. ఇంకెన్నాళ్లూ?’ ఉప్పల్‌ తిప్పల్‌పై పిల్లర్లకు పోస్టర్లు


 

మరిన్ని వార్తలు