ఫేక్‌ రిపోర్ట్‌.. ఫేక్‌ పార్టీ.. ఫేక్‌ లీడర్‌ 

19 Aug, 2022 03:37 IST|Sakshi

ఫేక్‌ వీడియోతో టీడీపీ అనైతిక రాజకీయం 

ఎమ్మెల్సీ పోతుల సునీత 

సాక్షి, అమరావతి: టీడీపీ సిగ్గు, ఎగ్గు లేకుండా ఫేక్‌ వీడియోలు, ఫేక్‌ సర్టిఫికెట్‌లతో అనైతిక రాజకీయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఫేక్‌ అని, దాని అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఫేక్‌ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంక్షేమ పాలన చూసి కడుపు మంటతో టీడీపీ దుష్ట రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎంపీ మాధవ్‌పై ఫేక్‌ వీడియో రూపొందించి, దుష్ప్రచారం చేసిన, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులు అనిత, పట్టాభి.. ఫేక్‌ వీడియోలను పదేపదే ప్రసారం చేసిన ఎల్లోమీడియా చానళ్లు, పత్రికలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, తన పని తాను చేసుకుపోతుందనే విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తించాలన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. 

మనుగడ కోసం టీడీపీ నీచ రాజకీయం 
► ఇలాంటి ఫేక్‌ వీడియోలతో రాజకీయాలు సాధ్యం కాదని టీడీపీ ఇప్పటికైనా గుర్తించాలి. సీఎం జగన్‌ ఏపీని దేశంలోనే ఉన్నత స్థానంలో నిలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆదరణ కోల్పోయిన టీడీపీ.. మనుగడ కోసం ఫేక్‌ వీడియోలు, మార్ఫింగ్‌ వీడియోలతో నీచ రాజకీయం చేస్తోంది.  
► టీడీపీ వారే ఫేక్‌ వీడియో సృష్టించి, దాన్ని లండన్‌కు పంపి, టీడీపీకి చెందిన ఐ టీడీపీ గ్రూప్‌ ద్వారా దాన్ని అప్‌లోడ్‌ చేసి, సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆ వీడియోను అమెరికాలోని ఒక ల్యాబ్‌కు పంపామని, ఆ వీడియో వాస్తవమని నివేదిక వచ్చిందని రచ్చ చేశారు. తీరా ఆ నివేదిక తాము ఇవ్వలేదని సదరు ల్యాబ్‌ వారు స్పష్టం చేయడంతో టీడీపీ బండారం బయట పడింది.  
► తద్వారా రాష్ట్రంలో టీడీపీ ఏ స్థాయిలో దుర్మార్గమైన రీతిలో రాజకీయం చేస్తోందన్నది అందరికీ అర్థమైంది. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలే. ఎప్పుడూ ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుని రాజకీయాలు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నాడు. 
► రాష్ట్రంలో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా, ఒక బీసీ నేత, స్వయంగా ఎంపీపైనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా సీఎం జగన్‌పై నిందలు మోపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పిచ్చిపిచ్చిగా మాట్లాడిన అనిత, పట్టాభిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి. 

మరిన్ని వార్తలు