వారంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా: ప్రకాష్‌ జవదేకర్‌

24 Sep, 2023 16:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ  దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక, పార్టీ నాయ‌కుల మ‌ధ్య‌ ఐక్యత, ఎన్నిక‌ల ప్రచార వ్యూహంపై దృష్టి సారించింది. ఇందుకోసం కోసం ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తోంది. 

ఈ క్రమంలో వారం రోజుల్లో బీజేపీ మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇంచార్జ్‌ ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచి తెలంగాణలో బీజేపీ వరుస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విస్తృత ప్రచారం చేయనున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తమ దగ్గర  అనేక అస్త్రాలు, వ్యూహాలు ఉన్నాయని అన్నారు.

ఎంపీ బండి సంజయ్‌కు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించామన్నారు ప్రకాష్‌ జవదేకర్‌. బీఆర్‌​ఎస్‌, బీజేపీ మధ్య ఏదో అవగాహన ఉందని కాంగ్రెస్‌ కుట్రపూరిత ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లోపాయకారిగా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. 
చదవండి: తెలంగాణలో మాకు విజయావకాశాలు: రాహుల్‌ గాంధీ

మరిన్ని వార్తలు