‘విశ్వకర్మబంధు’ను ప్రకటించి అమలు చేయాలి: జాజుల

24 Aug, 2021 08:47 IST|Sakshi

సమస్యల పరిష్కారానికి విశ్వకర్మ నేతల రిలే నిరాహారదీక్ష

కవాడిగూడ (హైదరాబాద్‌): విశ్వకర్మ సామాజికవర్గం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తున్న ప్రభు త్వానికి గుణపాఠం చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపు నిచ్చారు. దళిత బంధులాగే విశ్వకర్మల అభివృద్ధికోసం ‘విశ్వకర్మబంధు’ను తక్షణమే ప్రకటించి అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో విశ్వకర్మలు తమ ఓటుద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. విశ్వకర్మీయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద విశ్వకర్మనేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ దీక్షకు జాజుల, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్‌ కుందారం గణేషాచారి హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసి ప్రత్యేక రాష్ట్రం రావడానికి ప్రధాన కారకులైన విశ్వకర్మల బతుకులు ఏమాత్రం బాగాలేవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు ప్రకటించిన అన్ని హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

ఆదివాసీబంధు అమలు చేయండి
ఆదిలాబాద్‌లో తుడుందెబ్బ ధర్నా.. కలెక్టరేట్‌ ముట్టడి 
సాక్షి, ఆదిలాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచి్చన దళితబంధు పథకం తరహాలోనే అత్యం త వెనుకబడిన తమ వర్గానికి కూడా ఆదివాసీబంధు అమలు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం పెద్ద ఎత్తున ఆదివాసీలు ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ను ముట్ట డించారు. కలెక్టర్‌ బయటకు వచ్చి తమ వినతిపత్రం స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. అయితే కలెక్టర్‌ బయటకు రాకపోవడంతో దా దాపు రెండు గంటలు ధర్నా కొనసాగించా రు. అనంతరం సమీపంలోని కుమురం భీం చౌక్‌కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. సాయంత్రం 4 గంటల వరకు ఆదివాసీల ఆందోళన కొనసాగింది.

ఈ సందర్భంగా నా యకులు మాట్లాడుతూ ఆదివాసీబంధు అమ లు చేసి ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే లంబాడా సామాజికవర్గాన్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. ఆదివాసీలు సా గు చేస్తున్న అటవీ భూములకు హక్కు పత్రా లు ఇవ్వాలని కోరారు. సాయంత్రం అదనపు కలెక్టర్‌ నటరాజ్, ఆర్డీవో జాడి రాజేశ్వర్‌ ఆదివాసీల దగ్గరికి రావడంతో వారు శాంతించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కాగా, ఆదివాసీల రాస్తారోకో కారణంగా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు మూడు గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సమయంలోనే రిమ్స్‌కు వెళ్లే అంబులెన్స్‌లు రావడంతో ఆదివాసీలు వాటి కి దారి వదిలారు. తుడుందెబ్బ జిల్లా అధ్య క్షుడు గొడం గణేశ్, ఉపాధ్యక్షుడు శ్యామ్‌రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు