Presidential Elections 2022: ముర్ము అంటే గౌరవం.. సిన్హాకే సంపూర్ణ మద్దతు: ఆప్‌

16 Jul, 2022 14:56 IST|Sakshi

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో.. మద్దతు విషయంలో పార్టీలన్నీ ఒక స్పష్టతకు వచ్చేస్తున్నాయి. దేశంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీగా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. రెండు రాష్ట్రాల్లో కలిపి పది రాజ్యసభ ఎంపీలను కలిగి ఉంది. ఈ తరుణంలో ఆప్‌ మద్దతు ఎవరికనే దానిపై ఆసక్తి నెలకొంది. 

ఇదిలా ఉంటే.. ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ మద్దతు విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకే అని ప్రకటించింది. ఈ మేరకు ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ శనివారం ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము అంటే మా సభ్యులందరికీ ఒక గౌరవం ఉంది . కానీ, మా మద్దతు మాత్రం యశ్వంత్‌ సిన్హాగారికే అని.. ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ భేటీ తర్వాత సంజయ్‌ సింగ్‌ ప్రకటించారు.  


రాష్ట్రపతి ఎన్నిక జులై 18న జరుగుతుండగా.. 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నామినేషన్‌ సమయానికే ద్రౌపది ముర్ముకు 50 శాతం ఓటింగ్‌ దక్కింది. ఆపై బీజేపీ, వైఎస్సార్‌సీపీ, బీజేడీ, బీఎస్పీ, శిరోమణి అకాలీ దల్‌, శివసేన లాంటి పార్టీల మద్దతు తర్వాత ఇప్పటికే  రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి 60 శాతం దాటింది. మరోవైపు కాంగ్రెస్‌, టీఎంసీ, ఎన్సీపీ, టీఆర్‌ఎస్‌ తదితర పార్టీల మద్దతుతో బరిలో దిగనున్నారు యశ్వంత్‌ సిన్హా.

మరిన్ని వార్తలు