కథల్లో ఉండే ‘అహంకారి రాజు’ ప్రధాని మోదీ

21 Feb, 2021 05:10 IST|Sakshi
శనివారం ముజఫర్‌నగర్‌లో గదతో ప్రియాంక గాంధీ  

ప్రధానిని ఎద్దేవా చేసిన ప్రియాంకా గాంధీ వాద్రా

మహాపంచాయత్‌లో ప్రసంగించిన కాంగ్రెస్‌ నేత

లక్నో: ప్రధాని మోదీని పురాతన కథల్లో ఉండే ‘అహంకారి రాజు’పాత్ర వంటి వ్యక్తి అంటూ కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా పోల్చారు. దేశాన్ని రక్షించే సైనికుడు కూడా ఒక రైతు కొడుకేనన్న విషయం కూడా ప్రధాని తెలుసుకో లేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ముజఫర్‌ పూర్‌లో శనివారం జరిగిన కిసాన్‌ మహా పంచాయత్‌కు హాజరై ఆమె ప్రసంగించారు. తన పాలన విస్తరించడంతో రాజ మందిరానిదే పరిమితమయ్యే అహంకారి రాజులా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రధాని దృష్టంతా తన స్వార్థం, కోటీశ్వరులైన తన మిత్రుల గురించే ఉంటుందనీ, అందుకే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న రైతుల డిమాండ్‌ను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

కొత్త సాగు చట్టాలతో రైతుల హక్కుల హరించుకుపోతాయని, మండీలు, కనీస మద్దతు ధర విధానం ఇకపై ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. వంటగ్యాస్, డీజిల్, కరెంటు ధరలు పెంచుతూ పోతున్న ప్రభుత్వం..చెరకు మద్దతు ధరను మాత్రం అలాగే ఉంచిందని తెలిపారు. ‘గత ఏడాది డీజిల్‌పై విధించిన పన్నుతో ప్రభుత్వానికి రూ.3.5లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సొమ్మంతా ఎక్కడికి పోయింది. దేశం కోసం రేయింబవళ్లు స్వేదం చిందించే రైతులకు ఈ సొమ్ము ఎందుకు అందడం లేదు?’అని అన్నారు. అమెరికా, చైనా, పాకిస్తాన్‌లలో పర్యటించే ప్రధాని మోదీ.. తన నివాసానికి 5,6 కిలోమీటర్ల దూరంలోనే ఆందోళనలు జరుపుతున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లలేకపోతున్నారని దుయ్యబట్టారు.

చదవండి: 
కాలం చెల్లిన చట్టాలు మనకొద్దు

>
మరిన్ని వార్తలు