వైఎస్సార్‌సీపీ ప్రభంజనం.. నెల్లూరు కార్పొరేషన్‌లో క్లీన్‌స్వీప్

17 Nov, 2021 16:14 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. అన్ని స్థానాల్లో గెలుపొంది ఎన్నికలను క్లీన్‌స్వీప్‌ చేసింది. నెల్లూరు కార్పొరేషన్‌లో ఫ్లాప్‌ షోతో.. సైకిల్‌ పార్టీ బొక్కబోర్లాపడింది. కార్పొరేషన్‌లోని 46 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 46 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి  కార్పొరేషన్‌లో ఉన్న మొత్తం 54 డివిజన్లను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది. 
 

మరిన్ని వార్తలు