‘ఢిల్లీలో ఏమన్న చేసుకోండ్రి.. మా రాష్ట్రంలో ఏందీ లొల్లి: సీఎం యూటర్న్‌

13 Sep, 2021 17:53 IST|Sakshi

రైతు ఉద్యమంపై పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ యూటర్న్‌

తొలిసారి నల్ల చట్టాల రద్దు నిరసనలపై ఆగ్రహం

రాష్ట్రం ఆదాయం కోల్పోతుందని ఆందోళన

వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో స్వరం మార్పు

చండీగఢ్‌: మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు సంవత్సరానికి పైగా పోరాడుతున్న రైతులపై తొలిసారి పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనపై యూటర్న్‌ తీసుకున్నారు. రైతుల నిరసన కార్యక్రమాలతో తమ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నారు. ‘ఢిల్లీలో ఇష్టమొచ్చినట్టు చేసుకోండి.. కానీ పంజాబ్‌లో ఎందుకు’ అని ప్రశ్నించారు. కేంద్రంపై పోరాడేందుకు ఢిల్లీలో ఉద్యమం చేయాలని సూచించారు.
చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్‌ హుష్‌కాకి

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు రైతులు తమ శక్తియుక్తుల్ని ఉపయోగించాలని చెప్పారు. రాష్ట్రంలో కాదని పేర్కొన్నారు. పంజాబ్‌కు ఎందుకు నష్టం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. హరియాణా, ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేసుకోండి అని సూచించారు. రైతులు ఢిల్లీ, హరియాణాలోని 113 ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు అని తెలిపారు. ‘మీ ఆందోళనతో రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడడం ఆందోళనకరం’ అని ఆరోపించారు. రాష్ట్రం ఆదాయం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి: రజనీకాంత్‌ స్టైల్‌లో మంత్రి హరీశ్‌రావు డ్యాన్స్‌

పంజాబ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సీఎం అమరీందర్‌సింగ్‌ ఈ విధంగా యూటర్న్‌ తీసుకున్నారని తెలుస్తోంది. నల్ల చట్టాల రద్దుకు రైతులు పంజాబ్‌లో భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. పది నెలలుగా రైతులు నల్ల చట్టాల రద్దుకు ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాలతో తమకు మద్దతు ధర దక్కదని.. వ్యవసాయం కార్పొరేటు పరం అవుతుందనే ఆందోళనతో రైతులు ఉద్యమ బాట పట్టారు.

మరిన్ని వార్తలు