ఆ ఉద్యోగం వద్దు..  పంజాబ్‌ ఎమ్మెల్యే స్పష్టీకరణ

25 Jun, 2021 09:06 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఫతేజంగ్‌ సింగ్‌ బజ్వా తన కుమారుడు అర్జున్‌ ప్రతాప్‌సింగ్‌కు ప్రభుత్వం ఇచ్చిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాన్ని వదులుకున్నట్టు స్పష్టం చేశారు. బజ్వా తండ్రి వేర్పాటు ఉద్యమ కాలంలో ఖలిస్తాన్‌ ఉగ్రవాదుల చేతుల్లో బలి కావడంతో కారుణ్య నియామకాల కింద ఆయన కుమారుడికి ఈ ఉద్యోగాన్ని ఇచ్చారు.

ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఇద్దరు ఎమ్మెల్యేల కుమారుల్లో ఒకరికి పోలీసు ఇన్‌స్పెక్టర్, ఇంకొకరికి డిప్యూటీ తహసీల్దార్‌ ఉద్యోగం ఇవ్వడంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మౌనం వీడిన ఎమ్మెల్యే తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అందుకే ఆ ఉద్యోగం అక్కర్లేదని కుటుంబ సభ్యులందరం నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు.

చదవండి: వ్యాక్సినేషన్‌పై అపోహలు తొలగించండి

మరిన్ని వార్తలు