సాగు బిల్లులపై కాంగ్రెస్‌ పోరు

25 Sep, 2020 04:35 IST|Sakshi
అమృత్‌సర్‌కు సమీపంలో రైలు పట్టాలపై పడుకుని నిరసన తెలుపుతున్న పంజాబ్‌ రైతులు

పంజాబ్‌లో రైల్‌రోకో

నేడు భారత్‌బంద్‌కు రైతుసంఘాల పిలుపు

న్యూఢిల్లీ/చండీగఢ్‌: వ్యవసాయ, కార్మిక సంస్కరణల బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలను ప్రారంభించింది. ఈ నిరసన కార్యక్రమాలను రెండు నెలలపాటు నిర్వహిస్తామని చెప్పింది. ఇందులో భాగంగా పంజాబ్‌లో గురువారం రైల్‌ రోకో నిర్వహించింది. కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్‌‡్ష కమిటీ, ఇతర రైతు సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రైల్‌ రోకో కార్యక్రమం మొదలైంది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ కార్యకర్తలు బర్నాలా, సంగ్రూర్‌ ప్రాంతంలో రైల్వే పట్టాలపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్‌‡్ష కమిటీదేవిదాస్‌పూర్, బస్తీ టాంకా వాలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు తమ ఆందోళనలకు మద్దతిస్త్నునట్లు కమిటీ ప్రతినిధులు కొందరు తెలిపారు.

నేడు భారత్‌ బంద్‌
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పలు రైతు సంఘాలు శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. రైతుల ఎజెండాకు కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాలీదళ్‌ మద్దతు పలికాయి.  25న అంటే శుక్రవారం పూర్తిస్థాయి బంద్‌ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీ రైతులను, కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారని ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 

మరిన్ని వార్తలు