పంజాబ్‌లో మారనున్న రాజకీయ సమీకరణాలు

27 Oct, 2021 16:29 IST|Sakshi

చంఢీగడ్‌: త్వరలోనే తాను.. కొత్త పార్టీ పేరు, గుర్తును ప్రకటిస్తానని పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం అనుమతి కోసం వేచిచూస్తున్నామని... ఆ ప్రక్రియ కాగానే పార్టీ పేరును ప్రకటిస్తానని అమరీందర్‌ సింగ్‌ అన్నారు.  బీజేపీతో ఎలాంటి పోత్తు ఉండబోదని స్పష్టం చేశారు.

కొందరు కావాలనే తనపై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము 117 స్థానాల్లో పోటీకి దిగుతామని అన్నారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్‌ నాయకులు తనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. తాను పంజాబ్‌ సీఎంగా ఉన్నప్పుడే.. 90 శాతానికి పైగా ఎన్నికల వాగ్దానాలను పూర్తి చేశానని పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. 

చదవండి: తమిళనాడులో కేంద్రం కొత్త ఆట.. రసవత్తరంగా రాజ్‌భవన్‌ రాజకీయం..!

మరిన్ని వార్తలు