కొత్త పార్టీని ప్రకటించిన పంజాబ్‌ మాజీ సీఎం..

2 Nov, 2021 20:19 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ మంగళవారం కొత్త పార్టీ పేరుని ప్రకటించారు. దీంతో కొన్ని నెలలుగా ఆయన.. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త పార్టీ పేరును ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌’ అని అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. పార్టీ గుర్తు ఎన్నికల సంఘం పరిశీలనలో ఉందన్నారు.

త్వరలోనే నూతన పార్టీ గుర్తును కూడా వెల్లడిస్తానని తెలిపారు. అదే విధంగా అమరీందర్‌ సింగ్‌.. తన రాజీనామాను ట్విటర్‌లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి పంపినట్లు తెలిపారు. ఈ లేఖలో రాజీనామాకు గల కారణాలను పొందుపర్చానని అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. పంజాబ్‌ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తన పార్టీ పనిచేస్తోందని అన్నారు.

బీజేపీతో.. తమ పార్టీకి పొత్తు ఉంటుందని ఎక్కడ ప్రకటించలేదన్నారు. కేం‍ద్రం రైతు చట్టాల సమస్యను పరిష్కరిస్తే.. ఆ తర్వాత పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు