వరద రెస్క్యూ ఆపరేషన్‌లో అపశృతి.. పాము కాటుకు గురైన ప్రముఖ మంత్రి..

19 Aug, 2023 18:13 IST|Sakshi

చంఢీగర్‌: పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్‌ సింగ్ బైన్స్‌ పాముకాటుకు గురయ్యారు. రూపనగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సంచరిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఆగష్టు 15 రాత్రి పాముకాటుకు గిరికాగా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

వర్షాల కారణంగా పాంగ్, భాక్రా డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయగా.. పంజాబ్‌లో రూప్‌నగర్, గుర్‌దాస్‌పూర్, హోసియాపూర్, కపుర్తలా, ఫిరోజ్‌పూర్ ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఈ డ్యామ్‌ల నుంచి విడదలైన నీటితో బియాస్, సట్లేజ్ నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. 

మంత్రి హర్జోత్‌ సింగ్ బైన్స్‌ తన సొంత నియోజకవర్గమైన ఆనంద్‌పూర్ సాహిబ్‌లో సహాయక చర్యలు చేపట్టారు. తానే స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా..పాముకాటుకు గురయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా రక్షించినట్లు చెప్పారు.   

ఇదీ చదవండి: బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్‌ చేరి..


 

>
మరిన్ని వార్తలు