అదే జరిగితే ఇవే నాకు చివరి ఎన్నికలవుతాయేమో!: పువ్వాడ

22 Sep, 2023 14:34 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం అసెంబ్లీ స్థానం మహిళ రిజర్వడ్ అయితే ఇవే తనకు చివరి ఎన్నికలు అయితయేమోనని అన్నారు. ఒకవేళ ఖమ్మం స్థానం మహిళలకు రిజర్వ్ అయితే తమ ఇంట్లో నుంచిమెవరిని నిలబెట్టనని అన్నారు. పార్టీ కోసం పని చేసిన మహిళలు మాత్రమే పోటీలో ఉంటారని స్పష్టం చేశారు .మహిళల కోసం మనమంత ముందు పడాలని.. కేటిఆర్ చెప్పినట్లు తన స్థానం త్యాగం చేయడానికి సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే తాను ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చేయాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదన్నారు.

ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం నియోజకవర్గాన్ని ఖమ్మం జిల్లాను వదిలిపెట్టేది లేదన్నారు. ఎవరెవరో వచ్చి దండాలు పెట్టి మళ్లీ మాయమైపోతారని, అలాంటి వారికి దూరంగా ఉండాలని తెలిపారు.

ఖమ్మం అభివృద్దిని సాదుకోవాలో చంపుకోవాలో మీరు డిసైడ్ చేయండి. గతంలో ఇక్కడ గెలిపించిన ఏవరైన సరే రెండవసారి ఖమ్మంలో ఉండే ప్రయత్నం చేయలేదు. ఏవరిని గెలిపించిన అటో ఇటో చూసి పారిపోయారు. కాని అజయ్ అన్న మాత్రం ఇక్కడే ఉన్నాడు. కళ్లబొల్లి మాటలు చెప్పేవారు ఎన్నికలపుడే వస్తారు. ఎన్నికలు అయిపోతే మాయమైపోతారు. నిత్యం మీ వెంట ఉండేది అజయ్ అన్న మాత్రమే. మూడవసారి నన్ను గెలిపించుకొని మళ్లీ 5 ఏళ్లు మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుతున్నాను.’ అని పేర్కొన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

మరిన్ని వార్తలు