నా పేరు మోదీ కాదు.. నేను అబద్దాలు చెప్పడానికి రాలేదు

1 Apr, 2021 01:17 IST|Sakshi
నల్‌బారి జిల్లాలో ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

అబద్ధాలు చెప్పడానికి నేనిక్కడికి రాలేదు

గువాహటిలో రాహుల్‌ గాంధీ

గువాహటి: దేశానికి నిత్యం (24/7) అబద్ధాలు చెప్పే మోదీని తాను కాదంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. ‘నా పేరు నరేంద్ర మోదీ కాదు. నేను అబద్దాలు చెప్పడానికి ఇక్కడికి రాలేదు. మోదీ అబద్ధాలను వినాలనుకుంటే కేవలం టీవీ ఆన్‌ చేయండి చాలు. దేశానికి ఆయన నిత్యం అబద్ధాలు చెబుతూనే ఉంటారు’ అని రాహుల్‌ విమర్శించారు.

అస్సాంలోని కమ్రూప్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో మేము అయిదు హామీలిస్తున్నాం. రాష్ట్రంలో సీఏఏను అమలు కానివ్వబోం. అయిదేళ్లలో అయిదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తాం. తేయాకు కార్మికుల వేతనాలను రూ. 193 నుంచి రూ. 365కు పెంచుతాం. గృహిణులకు నెలకు రూ. 2  వేలు ఆర్థిక సాయం అందిస్తాం. ఇవే మేమిస్తున్న అయిదు హామీలు. మేము బీజేపీలాగా కాదు. హామీలిస్తే అమలు చేసి చూపిస్తాం. పలు రాష్ట్రాల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేసి చూపించామన్నారు. 

చదవండి: (బీజేపీ నియంతృత్వాన్ని ఎదిరిద్దాం)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు