అన్‌పార్లమెంటరీకి నిర్వచనం ఇదే.. విపక్షాల సెటైర్లు

14 Jul, 2022 16:58 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఎంపీల నిషేధిత పదాల జాబితాపై విస్తృత స్థాయి చర్చ నడుస్తోంది ఇప్పుడు. లోక్‌సభ సెక్రటేరియెట్‌ విడుదల చేసిన బుక్‌లెట్‌లో.. జుమ్లాజీవి, బాల్‌ బుద్ధి, కోవిడ్‌ స్ప్రెడర్‌, స్నూప్‌గేట్‌, అరాచకవాది‌, శకుని, నియంత, నియంతృతత్వం‌, తానాషా, తానాషాహి, వినాశ్‌ పురుష్‌, ఖలీస్థానీ.. ఇలాంటి పదాలెన్నింటినో లిస్ట్‌లో చేర్చారు. 

జులై 18 నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల కోసం ఈ లిస్ట్‌ రిలీజ్‌ చేసింది. అయితే ఈ పదాలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యంగ్యం ప్రదర్శించారు. అన్‌పార్లమెంటరీగా నిర్వచనం.. అంటూ న్యూ డిక్షనరీ ఫర్‌ న్యూ ఇండియా ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. 

ప్రధాని ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారో.. సరిగ్గా ఆ అంశంపై చర్చలకు, ఉపన్యాయాలకు సరిపోయే పదాలనే ఇప్పుడు అన్‌పార్లమెంటరీ పదాలుగా పేర్కొంటున్నారు. వాటిని నిషేధించారు అంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఆ పదాలన్నింటితో కలిపి ఒక సెంటెన్స్‌ను సైతం ఉదాహరణగా పేర్కొన్నారు. 

పై లిస్ట్‌పదాలతో పాటు.. పార్లమెంట్‌ చర్చల్లో తరచూ వినిపించే సిగ్గుచేటు, మోసం, అవినీతి, వెన్నుపోటు, డ్రామా, హిప్పోక్రసీ లాంటి పదాలను సైతం అన్‌పార్లమెంటరీ లిస్ట్‌లో చేర్చారు. టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఒబ్రెయిన్‌ మాత్రం ఆ పదాలను ఉపయోగించే తీరతానని, సస్పెండ్‌చేస్తే చేసుకోండంటూ సవాల్‌ విసిరారు. 
 

మరిన్ని వార్తలు