Bharat Jodo Yatra: 'ఇండోర్‌లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు

18 Nov, 2022 15:47 IST|Sakshi

ఇండోర్‌: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఆయనను చంపేస్తామని బెదిరింపులు రావడం పార్టీ శ్రేణులకు ఆందోళన కల్గిస్తోంది. మధ్యప్రదేశ్‌ రాజధాని ఇండోర్‌ జుని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్వీట్ షాపు ముందు ఈ బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది.

రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర ఇండోర్‌లో అడుగు పెట్టగానే బాంబులేసి చంపేస్తామని లేఖలో ఉంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. ఈ లేఖ ఎవరి పని అయి ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడిపై తీవ్ర అభియోగాలు మోపి విచారణ చేపట్టారు. వీర్ సావర్కర్‌ ప్రాణభయంతో బ్రిటిషర్లను క్షమాభిక్ష కోరిన వ్యక్తి అని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన తరుణంలో ఈ బెదిరింపు లేఖ ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

రాహుల్ గాంధీ భారత్ ‍జోడో యాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. శుక్రవారం యాత్రలో మహాత్మ గాంధీ మునివనవడు తుషార్ గాంధీ.. రాహుల్‌తో పాటు పాదయత్రలో పాల్గొన్నారు. నవంబర్ 20న మహారాష్ట్రలో యాత్ర ముగించుకుని మధ్యప్రదేశ్‌లోకి రాహుల్ అడుగుపెట్టనున్నారు.

మరోవైపు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు మహారాష్ట్రలో కేసు పెట్టారు. స్వతంత్ర సమరయోధుడైన తన తాతను రాహుల్ అమమానించారని మండిపడ్డారు.
చదవండి: నెహ్రూ మునిమనవడితో గాంధీ మునిమనవడు.. వీడియో వైరల్‌

>
మరిన్ని వార్తలు