Rahul Gandhi: లండన్‌ ప్రసంగంపై దుమారం.. స్పందించిన రాహుల్‌ గాంధీ.. ఏమన్నారంటే!

16 Mar, 2023 15:01 IST|Sakshi

న్యూఢిల్లీ: లండన్‌ వేదికగా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందంటూ  కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ  చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత రాజకీయ దుమారాన్ని రాజేశాయో తెలిసిందే. రాహుల్‌ ప్రసంగంపై పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లుతున​ఆనయి. కాంగ్రెస్‌ నేతపై వ్యాఖ్యలపై అధికార తీవ్రంగా మండిపడుతోంది. విదేశీ గడ్డపై భారత్ పరువు తీశారని రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యుడు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాల్సిందేనని కాషాయ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు రాహుల్‌ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పే ప్రస్తక్తేలేదని కాంగ్రెస్‌ తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో లండన్‌ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాహుల్‌ గాంధీ స్పందించారు. తనెలాంటి దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదని లోక్‌సభ ఎంపీ స్పష్టం చేశారు. గురువారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తూ మీడియాతో మాట్లాడారు. ‘నేను ఎలాంటి దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు. విదేశాల్లో భారత్‌ను అవమానించానంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు స్పందించాల్సి వస్తే.. నాకు మాట్లాడానికి అనుమతి ఇస్తే సభలోనే మాట్లాడతాను’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా దేశ వ్యతిరేక శక్తులన్నీ ఒకే విధంగా ప్రవర్తిస్తాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాహుల్ గాంధీ లండన్‌లో భారత దేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను రిజిజు గురువారం ప్రస్తావించారు. దేశ వ్యతిరేక శక్తుల మాదిరి ఆయన మాట్లాడారంటూ మండిపడ్డారు. రాహుల్‌ దేశాన్ని అవమానించేందుకు యత్నిస్తే పౌరులుగా మౌనంగా ఉండలేమని.. కాంగ్రెస్ నాయకత్వాన్ని తిరస్కరించినంత మాత్రాన.. ఆయన విదేశాల్లో భారత్‌ పరువు తీయొచ్చపూ అర్థం కాదని అన్నారు.
చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో బీజేపీ చిత్తు.. ఈసారి 70 సీట్లే.. ఫేక్‌ సర్వే వైరల్‌

మరిన్ని వార్తలు