కేంద్రం క్రూరంగా వ్యవహరిస్తోంది: రాహుల్‌ 

22 Jun, 2021 12:23 IST|Sakshi

సాక్షి న్యూఢిల్లీ: కరోనా కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించకుండా క్రూరంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సోమ వారం వ్యాఖ్యానించారు. ప్రాణానికి విలువ కట్టడం అసాధ్యమని, ప్రభుత్వం ఇచ్చేది కొద్దిపాటి సాయం మాత్రమేనని పేర్కొన్నారు. అయితే మోదీ ప్రభుత్వం ఆ చిన్న సాయం చేయడాని కూడా సిద్ధంగా లేదని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు.

మహమ్మారి సమయంలో మొదట వైద్యం అందించలేదని, ఆ తర్వాత కరోనాపై తప్పుడు సంఖ్యలు చెప్పారని, ప్రస్తుతం ప్రభుత్వం క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. దిగజారిన ఆర్థిక పరిస్థితుల రీత్యా కరోనాతో మరణించిన వారికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

చదవండి: హైకోర్టులో మమతకు చుక్కెదురు

మరిన్ని వార్తలు