పీఎం మోదీ ‘70 ఏళ్ల పాలన’ విమర్శలపై రాహుల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌..!

25 Sep, 2022 10:25 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్త ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్న రాహుల్‌.. మరోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ 70 ఏళ్ల పాలనపై ప్రధాని మోదీ తరుచుగా చేసే విమర్శలను సూచిస్తూ ట్వీట్‌ చేశారు. అందుకు ఇదే మా సమాధానం అంటూ పలు అశాలను లేవనెత్తారు రాహుల్‌. 

‘పీఎం తరుచుగా.. 70 ఏళ్లలో ఏం చేశారని అడుగుతారు? మేము ఎప్పుడూ గరిష్ఠ నిరుద్యోగ భారతంగా మార్చలేదు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ధరల పెరుగుదలను మేము ఎప్పుడూ దేశానికి ఇవ్వలేదు. బీజేపీ ప్రభుత్వం రైతులు, యువత, మహిళల కోసం పని చేసేది కాదు. ప్రతి వ్యాపారంలో గుత్తాధిపత్యం చేలాయించాలని భావిస్తున్న కేవలం 5-6 మంది సంపన్నుల కోసం ఏర్పడిన ప్రభుత్వం.’ అని విమర్శలు చేశారు రాహుల్‌ గాంధీ. 

హిమాచల్‌ ప్రదేశ్‌ యువతతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో భారత దేశ కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్నాయని విమర్శించారు. యువతతో మోదీ భేటీ అనంతరం రాహుల్‌ గాంధీ ఈ ట్వీట్‌ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: 6 ఏళ్ల తర్వాత నితీశ్‌, లాలూతో సోనియా గాంధీ భేటీ!

మరిన్ని వార్తలు