కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోంది: రాహుల్‌

8 Aug, 2020 12:02 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆశా ఆరోగ్య కార్యకర్తల సమ్మె నేపథ్యంతో  కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. తమకు మెరుగైన సేవా పరిస్థితులు, ప్రయోజనాలు కల్పించాలని ఆశా కార్యకర్తలు రెండు రోజులపాటు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆశా కార్యకర్తల విషయంలో మౌనం వహిస్తోందని రాహుల్‌ విమర్శించారు. ప్రస్తుతం వారి సమస్యలను ఏమాత్రం వినిపించుకోకుండా గుడ్డిగా వ్యవహిస్తోందని ‌విరుచుకుపడ్డారు. ఆశా వర్కర్లు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఆరోగ్య రక్షకులుగా సేవలు అందిస్తారు. వారు నిజమైన ఆరోగ్యయోధులని​ అన్నారు. అటువంటి ఆరోగ్య కార్యకర్తలు నేడు తమ సొంత హక్కుల కోసం రోడ్లపై సమ్మెల చేయాల్సి వస్తోందని రాహుల్‌ కేంద్రంపై మండిపడ్డారు. (మోదీ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?)

ఆశా(అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్), అంగన్‌వాడీ, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని కార్మికులకు సంబంధించిన పలు మీడియా నివేదికలను రాహుల్‌ తన ట్విటర్‌లో ట్యాగ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ శుక్రవారం నుంచి రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్న విషయం తెలిసిందే. పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల పిలుపుతో దేశ వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది ఆశా వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు