వరంగల్‌ : రాజన్న రాజ్యం షర్మిలతోనే సాధ్యం

3 Mar, 2021 08:32 IST|Sakshi

హన్మకొండ/వరంగల్‌ : దివంగత మహానేత రాజన్న రాజ్యం వైఎస్‌.షర్మిలతోనే సాధ్యమని వైఎస్సార్‌ అభిమానుల సంఘం ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్‌ అన్నారు. హన్మకొండ సుబేదారిలోని ఓ హోటల్‌లో వైఎస్సార్‌ అభిమానుల ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల స్థాపించనున్న రాజకీయ పార్టీకి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం శాంతికుమార్‌ మాట్లాడుతూ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే షర్మిలకు అండగా నిలవాల్సిన అవసరముందని తెలిపారు. ఈ సమావేశంలో అప్పం కిషన్, రాములు నాయక్, కాందడి బుచ్చిరెడ్డి, దేవానాయక్, సంగాల ఈర్మియా, బీంరెడ్డి స్వప్న, రజనీకాంత్, విల్సన్‌ రాబర్ట్, పసునూరి ప్రభాకర్, డి.సంపత్, రాంజీ, రవికుమార్, కె.గణేశ్, బొర్ర సుదర్శన్‌ కాశీం పాషా, బొచ్చు రవి, వీరబ్రహ్మం, కాయిత రాజ్‌కుమార్, రవితేజరెడ్డి, గుండ్ల రాజేశ్‌రెడ్డి, కట్టయ్య, ప్రశాంత్, ఎం.డీ.ఖాన్, వీరారెడ్డి, రఘోత్తం, వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్, శ్రీరాం పాల్గొన్నారు. 

చదవండి :  (రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నా: వైఎస్‌ షర్మిల)
(మీతోడు ఉంటే అది సాధ్యమని నమ్ముతున్నా: వైఎస్‌ షర్మిల)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు