బీజేపీకి కాంగ్రెస్‌ మద్దతిస్తోంది.. ఇక మేమెందుకు?

12 Dec, 2020 09:31 IST|Sakshi

జైపూర్: రాజస్తాన్‌లోని అధికార కాంగ్రెస్‌ పార్టీ.. బీజేపీతో కలిసి పనిచేస్తోందని భారతీయ ట్రైబల్‌ పార్టీ(బీటీపీ) ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ఒక్కటేనని బీటీపీ సీనియర్‌ నేత ఒకరు విమర్శలు గుప్పించారు. ఒకవేళ అదే జరిగితే తాము కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు.  ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే . రాజస్థాన్ ప్రభుత్వం నుంచి భారతీయ ట్రైబల్‌ పార్టీ  తమ మద్దతును ఉపసంహరించుకుంటాం’ బీటీపీ వ్యవస్థాపకుడు చోటుభాయ్ వాసవ ట్వీట్ చేశారు.  కాగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఉపసంహరణతో ప్రభుత్వ మెజారిటీని ప్రభావితం చేయలేదు కానీ, చిన్న పార్టీ అయిన బీటీపీని జిల్లా స్థాయి బోర్డు బాధ్యతలు తీసుకోకుండా చేయటానికి కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయి. ఇటీవల స్థానిక ఎన్నికలు జరిగిన తరుణంలో జిల్లా, గ్రామ స్థాయిలో సభ్యులను ఎన్నుకోవటానికి బీటీపీ ప్రయత్నాలు చేస్తోంది. దుంగార్‌పూర్ జిల్లా పరిషత్‌లో ఎన్నికల్లో 27 స్థానాలకు గాను బీటీపీ పార్టీ 13 మంది సభ్యులను గెలుచుకుంది. కాగా మెజారిటీ 14 స్థానాలు కావడంతో జిల్లాలో పంచాయతీ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరింది.

కానీ కాంగ్రెస్‌ పార్టీ బీటీపీకి మద్ధతు ఇవ్వకుండా బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులతో బోర్డు ఏర్పాటు చేయడానికి మద్ధతు ఇచ్చింది. కాంగ్రెస్‌ ఓటు శాతం ఉన్న ప్రాంతాలలో బీటీపీ పార్టీ తన స్థావరాన్ని మెరుగుపరుస్తోందనే కాంగ్రెస్‌ పార్టీలో ఆందోళన వెల్లడవుతుంది. దక్షిణ రాజస్థాన్‌లో ట్రైబల్‌ పార్టీకి బలమైన స్థావరం ఉంది. ఈ ఏడాది ఆరంభంలో డిప్యూటి సీఎం సచిన్ పైలట్ తన అనుచర వర్గంతో ప్రభుత్వానిక వ్యతిరేకంగా తిరుగుబాటు చేపిన విషయం విధితమే. తరువాత అశోక్ గెహ్లోట్ ప్రభుత్వానికి మద్దతు తెలుపడం వల్ల బీటీపీ మోసపోయినట్లు అనిపిస్తుంది. జైపూర్‌లోని ఒక రిసార్ట్‌లో కాంగ్రెస్ తన అనుచరులను కాపలా కాస్తుండగా, ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు నగరం విడిచి వెళ్ళకుండాపోలీసులు ఆపే వీడియోను పోస్ట్ చేశారు. అయినప్పటికీ, వారు తొందరలోనే మిస్టర్ అశోక్‌ గెహ్లాత్‌తో అతని ఎమ్మెల్యేలతో కలసి దిగన ఫోటోలలో బయటపడ్డారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కలిస్తే కాంగ్రెస్‌కు మెజారిటీ పెరుగుతుంది. 200 మంది సభ్యుల గల అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 106 మంది ఎమ్మెల్యేలతో పాటు 12 మంది స్వతంత్రుల అభ్యర్థులు ఉ‍న్నారు.

>
మరిన్ని వార్తలు