రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాల్సిందే 

2 Jan, 2021 09:22 IST|Sakshi

రజనీ అభిమానుల దీక్ష

టీ.నగర్‌ : రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు ఆర్కాడులో గురువారం నిరాహారదీక్ష చేశారు. హీరో రజనీకాంత్‌ డిసెంబరు 31వ తేదీన కొత్త పార్టీని ప్రారంభించి రాజకీయాల్లోకి రానున్నట్లు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలావుండగా తనకు ఆరోగ్యం సరిలేదని, రాజకీయ ప్రవేశం చేయడం లేదని హఠాత్తుగా రజనీ ప్రకటించారు. రజనీ రాజకీయ పార్టీ స్థాపించి ప్రజాసేవ చేస్తాడని భావించిన ఆయన అభిమానులు, మన్రం నిర్వాహకులు ఆయన ప్రకటనతో దిగ్భ్రాంతిలో మునిగారు.

అంతేకాకుండా పార్టీ ప్రారంభించి రాజకీయాల్లోకి రావాలని డిమాండ్‌ చేస్తూ రజనీ నివాసం ఎదుట ధర్నాలు చేపడుతున్నారు. ఆర్కాడు  వసిష్టేశ్వర ఆలయం ఎదుట రజనీ పూర్తిగా కోలుకుని రాజకీయాల్లో పాల్గొనాలంటూ అభిమానులు, రజనీ మక్కల్‌ మండ్రం నిర్వాహకులు నిరాహారదీక్ష చేపట్టి ప్రార్థనలు చేశారు. ఆర్కాడు నగర కార్యదర్శి ఏఎం. వరదన్, యూనియన్‌ కార్యదర్శి వీఎం సేట్టు సహా వంద మందికి పైగా మండ్రం నిర్వాహకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు