రజనీ కీలక సమావేశం.. త్వరలో ప్రకటన

30 Nov, 2020 11:52 IST|Sakshi

సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పయనానికి సంబంధించిన సస్పెన్స్‌ కొనసాగుతోంది. రాజకీయ ప్రవేశంపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్టు ఆయన తెలిపారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపం వేదికగా రజనీ మక్కల్‌ మండ్రం ముఖ్యనిర్వాహకులు, జిల్లాలో కార్యదర్శులతో సోమవారం రజనీకాంత్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘మా అభిప్రాయాలను కలుబోసుకున్నాం. నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. సాధ్యమైనంత తొందరలో నా నిర్ణయం ప్రకటిస్తాన’ని అన్నారు.

కాగా, రజనీకాంత్‌ చాలాకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అభిమానులతో సోమవారం ఆయన మరోసారి భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత స్పష్టత వస్తుందని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. తన రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్‌ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.
చదవండి: (తలైవా తేల్చేనా... నాన్చేనా..?)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా