Rajya Sabha Seats: మండవకు ‘రాజ్య’యోగం దక్కేనా..?

14 May, 2022 14:22 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో మొత్తం మూడు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధం అయింది. రెండు సాధా రణ స్థానాలు కాగా, ఒకటి ఉప ఎన్నిక. జిల్లా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి శ్రీనివాస్‌ పదవీకాలం వచ్చే నెల 21న ముగియనుంది. అదేవిధంగా కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు సభ్యత్వం కాలపరిమితి ముగియనుంది. మరొక స్థానం విషయానికి వస్తే ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్‌ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో దానికి ఉప ఎన్నిక జరుగనుంది.

దీనికి ఈ నెల 19 వర కు నామినేషన్ల గడువు ఉంది. మిగిలిన రెండు సాధారణ స్థానాలకు సంబంధించి ఈ నెల 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నా రు. జూన్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే జిల్లా నుంచి డీఎస్‌ ఖాళీ చేస్తున్న స్థానాన్ని సీనియర్‌ నేత, మాజీ మంత్రి మండవ ఆశిస్తున్నారు. కాగా జిల్లా నుంచి ఇప్ప టికే రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేష్‌రెడ్డి ఉన్నా రు. రాజ్యసభ సీట్లను ఆశించేవారి సంఖ్య అధికార పార్టీలో భారీగానే ఉంది. దీంతో అనేక స మీకరణాలు ప్రభావితం కానున్నాయి. ఈ మేర కు సీఎం ఎవరికి అవకాశం కల్పిస్తారేనే విషయ మై వివిధ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఆశావహుల్లో ప్రధానంగా మండవ వెంకటేశ్వరరావు పేరు మాత్రమే వినిపిస్తోంది. 

మరిన్ని వార్తలు