అస్తిత్వాన్ని చాటుకునేందుకే చంద్రబాబు తంటాలు

12 Aug, 2020 04:57 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య విమర్శ

కడప కార్పొరేషన్‌/ సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఒక ముగిసిన అధ్యాయం కాబోతుందన్న ఆందోళనతో తన అస్తిత్వాన్ని చాటుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు తంటాలు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య విమర్శిం చారు. మంగళవారం ఆయన కడపలో మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

► బాబుకు భ్రమల్లో బతకడం ఎక్కువైంది. 2014–19 మధ్య కాగితాల్లో చూపిన అభివృద్ధిని ఇప్పుడు మళ్లీ ప్రజలకు చూపిస్తూ సొంత మీడియాలో బాకా కొట్టుకోవడం సిగ్గు చేటు. అమరావతిలో కొన్ని భవనాలు మాత్రమే కట్టి మొత్తం రాజధాని పూర్తయినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం.
► చంద్రబాబు ప్రజలను అనేక విధాలుగా మభ్యపెట్టి నమ్మించారు. ప్రత్యేక విమా నాల్లో ఐదేళ్లపాటు విదేశాలకు పెట్టుబ డుల కోసమని పర్యటనలు చేసినా ఫలితం శూన్యం. 
► భాగస్వామ్య సదస్సులు పెట్టి రూ.25 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పినా అందులో 2 శాతం కూడా సాధించలేకపోయారు. ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. 
► బాబు అవినీతి ముద్రలు అన్ని జిల్లాల్లో అడుగడుగునా కనిపిస్తాయి. ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలియనట్లు అమాయకత్వం నటించడం విచిత్రంగా ఉంది.   

మరిన్ని వార్తలు