ఆ స్థానాన్ని ఇప్పటికీ గెలవలేని బీఆర్‌ఎస్‌, బీజేపీలు!

12 Mar, 2023 13:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు అందని ద్రాక్షగా ఉన్న మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం వచ్చే ఎన్నికల్లో ఎలగైనా సాధించాలనే పట్టుదలతో రెండు పార్టీలు బలమైన నేతలను రంగంలోకి దించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఈ రెండు పార్టీలు ఈ సీటును గెలవలేదు. మూడు సార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ మల్కాజ్‌గిరి ఎంపీ సీటును గెలిచాయి.

పునర్వీభజనలో ఏర్పడ్డ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడో సారి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. నాల్గో సారి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ పార్లమెంటు స్థానంలో గెలిచారు. 

మల్కాజిగిరి ఎంపీ స్థానానికి మురళీధర్‌రావు.. 
అధికంగా ఉత్తర భారతీయ ఓటర్లు, అధిక శాతం హైదరాబాద్‌ నగర ఓటర్లు ఉన్న మల్కాజిగిరి పార్లమెంటు సీటును ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్నో రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా పని చేసి బీజేపీని గెలిపించిన పార్టీ జాతీయ నాయకుడు మురళీధర్‌రావును మల్కాజ్‌గిరి నుంచి బరిలో దింపుతున్నట్లు సమాచారం. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌కు ఎలాంటి సంబంధం లేని మురళీధర్‌రావు తరుచూ నియోజకవర్గ పరిధిలోని వివిధ సెగ్మెంట్లలో తన పేరుపై కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టుకోసం యత్నాలు చేస్తున్నారు.

గత డిసెంబర్‌లో డబీల్‌పూర్‌ ఇస్కాన్‌ మందిరంలో మురళీధర్‌రావు నేతృత్వంలో గవర్నర్‌ తమిళిసైని రప్పించి హోమా లు నిర్వహించి అందరినీ అక్క డకు పిలిచారు. రెండు నెలల క్రితం కుత్బుల్లాపూర్‌ ఉత్తర భారతీయు లతో కార్యక్రమం నిర్వహించారు. తాజాగా డబీల్‌పూర్‌లో గోదావరి హార తి కార్యక్రమాలను చేపట్టా రు. ఇలా ఏ దో ఒక కార్య క్రమం చేస్తూ ఈ జాతీయ నేత హల్‌చల్‌ చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తారని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. 

మేడ్చల్‌ నుంచి కేఎల్‌ఆర్‌.. 
మేడ్చల్‌లో బీజేపీకి కాస్తో..కూస్తో.. పట్టున్నప్పటికీ బలమైన నాయకుడు ఆ పార్టీలో కనబడటం లేదు. అర్ధ బలం, ప్రజా బలం ఉన్న నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ బలమైన అభ్యర్థి వేటలో ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎన్నిక కావడంతో నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ను పార్టీలోకి చేర్చుకుని మేడ్చల్‌ నుంచి పోటీకి దింపాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. కేఎల్‌ఆర్‌తో పలు దఫాలు చర్చలు చేశారని ఆయన రెండు, మూడు నెలల్లో పార్టీలో చేరతారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 

రాజన్న ఉంటారో... 
గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి ఈ సారి ఆ పార్టీ టికెట్టు ఇస్తుందో..లేదో.. అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఆయన ఓడినప్పటికీ ఆయనకు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని ఆ పార్టీ అధిష్టానం ఇచ్చినా.. ఆయన పూర్తిగా నియోజకవర్గంలోని అన్ని సెగ్మెంట్లలో కనిపించలేదు. కేవలం మేడ్చల్‌కు పరిమితమయ్యారు.

తరుచూ మంత్రి కేటీఆర్, సీఎం కేపీఆర్‌లతో టచ్‌లో ఉన్నప్పటికీ ఎదుటి పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలనే వ్యూహంతో ఉండటంతో బీఆర్‌ఎస్‌ నుంచి ఎవరూ రంగంలో ఉంటారనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరకడం కష్టమే. 

మరిన్ని వార్తలు