ఆడియో టేపు-2 రిలీజ్: భారీ డీల్‌ కుదిరిందా?.. ఢిల్లీ నుంచి పెద్దలు వస్తున్నారా?

28 Oct, 2022 16:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్‌టాపిక్‌ మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలుపై రెండో ఆడియో టేప్‌ బయటకు వచ్చింది. మొత్తం 27 నిమిషాల పాటు ఆడియో కాల్ సాగింది. ఈ సందర్భంగా.. ఆడియోలో డబ్బుల గుర్తించి ప్రస్తావించడం విశేషం. ఒక్కొక్కరికి ఎంత డబ్బు ఇవ్వాలనేదానిపై ముగ్గురి మధ్య చర్చ సాగింది. ఒక్కొక్కరు రూ. 100 అడుతున్నారని రామచంద్ర భారతి, సింహయాజితో నందు చెప్పాడు. ఇలా వీరి మధ్య సంభాషణ కొనసాగింది. 

నందు: పైలట్‌ రోహిత్‌ రెడ్డితో నేను మాట్లాడాను. నువ్వు ముందుగా వస్తే.. నువ్వే టీమ్‌ లీడర్‌ అవుతావు అని చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఉంటుందని చెప్పాను. 
రామచంద్రభారతి: ఎంత ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు?.
నందు: రోహిత్‌ రెడ్డి ఒక్కరికే రూ. 100 ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాడు. మిగిలిన వారి మరో రేట్‌. 
రామచంద్రభారతి: అయితే నేను పైన చెప్పేటప్పుడు పైలట్‌ తనతో పాటు నలుగురిని తీసుకువస్తాడని చెప్తాను. రోహిత్‌ను తీసుకుంటే ఆయనతోపాటు మిగిలినవారు వస్తారని నేను చెప్తాను.

నందు: ఇక్కడ వ్యవస్థ సరిగాలేదని పైన చెప్పండి. పైలట్‌ రోహిత్‌రెడ్డి చాలా విలువైన లీడర్‌ అని పైన చెప్పండి. 
రామచంద్రభారతి: మనం ఎక్కడ కూర్చుంటున్నామో గుర్తుపెట్టుకోవాలి. చాలా పెద్దవాళ్లతో​ మాట్లాడేటప్పుడు ఒకసారి కమిట్‌ అయితే వెనక్కి వెళ్లలేం​. బండి సంజయ్‌, కిషన్‌రెడ్డితో కాదు.. ఇంకా పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాం. 

నందు: ఈ విషయం స్థానిక లీడర్లకు తెలియకూడదు. 
రామచంద్రభారతి: మనం చేసే ఆపరేషన్‌ తెలంగాణ లీడర్లకు తెలియకుండా చేస్తాం. మునుగోడు ఎన్నికల కంటే ముందు రూ. 100 అడిగినా నేను పైన మాట్లాడతాను. నన్ను పైలట్‌ రోహిత్‌రెడ్డితో మాట్లాడించండి. ఇప్పుడు ఎంత మంది రెడీగా ఉన్నారని తుషార్‌కు చెప్పాలి. మునుగోడు ఎన్నికల కంటే ముందు దీన్ని కంప్లీట్‌ చేయాలి. నన్ను వాట్సాప్‌లో వారితో కాన్ఫరెన్స్‌లో పెడితే నేను మాట్లాడాతాను. 

సింహయాజులు: 100 కిలోమీటర్ల రేడియస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు మనతో ఉన్నారు. కొడంగల్‌, తాండూర్‌, చేవేళ్ల ఎమ్మెల్యేలతో ఇప్పటికే మాట్లాడాను. 
రామచంద్రభారతి: కేవలం ఇద్దరు ముగ్గురి కోసం ఢిల్లీ నుంచి వారు రావడం సరికాదు. కనీసం 5 నుంచి ఆరుగురు జాయిన్‌ అయితే ఢిల్లీ వారిని రప్పించాలి. బల్క్‌గా ఎవరైనా చేరితేనే ఇంపాక్ట్‌ ఉంటుంది. 
సింహయాజులు: రూ. 100 కావాలని రోహిత్‌ అంటున్నాడు. రాజీనామా చేయాల్సి వస్తే ప్రభుత్వంతో ఢీకొనడం ఈజీ కాదని రోహిత్‌ అంటున్నాడు. 
రామచంద్రభారతి: రోహిత్‌ రాజీనామా చేస్తే.. నెలరోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది. ఢిల్లీలోనూ మేం పనిచేస్తున్నాం, 43 మంది ఢిల్లీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. అంటూ సంభాషణ కొనసాగింది.

మరిన్ని వార్తలు