రేవంత్‌పై పరువు నష్టం దావా వేస్తా: మాజీ ఎమ్మెల్యే విష్ణు

27 Aug, 2022 16:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పబ్ లైంగిక దాడి ఘటనపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడి ఆవరణలో మైనర్‌నపై లైంగికదాడి జరిగిందని ఆరోపించారు. అయితే రేవంత్‌ వ్యాఖ్యలను ఆలయ ట్రస్ట్‌ సభ్యులు ఖండించారు. రేవంత్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పెద్దమ్మ గుడి ఆలయ ట్రస్ట్‌ సభ్యులు ఫిర్యాదు చేశారు. 

మరోవైపు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత విష్ణువర్దన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాలయంలో ఎలాంటి ఆసాంఘిక కార్యక్రమాలు జరగలేదన్నారు. రేవంత్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని,  ఆలయ ఆవరణలో బాలికపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు.  

సీపీ క్లారిటీ ఇచ్చినా రేవంత్‌ బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది పార్టీ వ్యవహారం కాదని.. పెద్దమ్మ తల్లి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు తప్పు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్‌పై టెంపుల్‌ తరపున పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.. పెద్దమ్మ టెంపుల్‌పై మాట్లాడేముందు తనను రేవంత్‌ కనీసం సంప్రదించలేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు