ఓఆర్ఆర్‌ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు: రేవంత్ రెడ్డి

24 May, 2023 14:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డును సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణలో తెగనమ్మారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఓఆర్‌ఆర్‌ను తక్కువకే ముంబై కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. ప్రభుత్వ ఆలోచనను పదే పదే కాంగ్రెస్‌ ప్రజలకు వివరిస్తూ వచ్చిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పుడు మరో దోపిడికి తెరతీసిందన్నారు.

లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ ఇచ్చిన నెలరోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని.. రూ.7,388 కోట్లలో రూ.738 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాలని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. చెల్లించాల్సిన 10 శాతం చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారని.. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై కేటీఆర్‌ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
చదవండి: TS: బీజేపీ కార్యకర్తల్లో కొత్త కన్‌ఫ్యూజన్‌.. రంగంలోకి హైకమాండ్‌

సర్వేల ఆధారంగా టికెట్‌లు
సర్వేల ఆధారంగానే కాంగ్రెస్‌ నుంచి అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు ఉంటుందని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తన టికెట్‌తో సహా ప్రతీ టికెట్ సర్వేనే ప్రామాణికమని తెలిపారు. కర్ణాటకలో సిద్దారామయ్యకు కూడా అడిగిన టికెట్ కాకుండా సర్వే ఆధారంగానే టిక్కెట్ ఇచ్చారని తెలిపారు. పార్టీలో చేరే వారికి కూడా ఇదే వర్తిస్తుందన్నారు.. ఇంఛార్జి ఠాక్రే ఇదే విషయాన్ని చెప్పారని తనకు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీలో చేరిక ప్రతిపాదన వచ్చినప్పుడు చర్చిస్తామని, ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు