కేసీఆర్‌.. వడ్లు ఎట్ల కొనవో చూస్తా

21 Mar, 2022 01:37 IST|Sakshi

నెలాఖరులో ఉద్యమం మొదలు పెడతా: పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

రైతుల ముందు నేనే నడుస్తా

ఉప్పెనలా వస్తా .. సునామీ సృష్టిస్తా

దుడ్డు కర్రల సైన్యం నిర్మిస్తా..వేలాది మందితో ఫాంహౌస్‌కొస్తా

ఎల్లారెడ్డిలో ‘మన ఊరు–మన పోరు’ 

సాక్షి, కామారెడ్డి : ‘బిడ్డా కేసీఆర్‌.. వడ్లు ఎట్ల కొనవో చూస్తా.. దుడ్డు కర్రల సైన్యం నిర్మిస్తా.. వేలాది మందితో నీ ఫాంహౌస్‌కు ఉప్పెనలా దూసు కొస్తా.. సునామీ సృష్టిస్తా..’ అంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి గర్జించారు. ‘ఈ నెలాఖరులో వడ్ల కొనుగోలు కోసం ఉద్యమం మొదలు పెడతా.. రైతుల ముందు నేనే ఉంటా.. లాఠీ అయినా, తూటా అయినా నా నుంచే మొదలు కావాలె..’ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిర్వహిం చిన ‘మన ఊరు–మన పోరు’ బహిరంగ సభలో ప్రసంగించిన రేవంత్‌ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరి గారు. రూ.2 లక్షల కోట్లతో బడ్జెట్‌ పెడుతున్న కేసీఆర్‌.. రైతులు పండించిన ధాన్యం కొనేందుకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయలేడా? అని ప్రశ్నించారు. ఎల్లారెడ్డి సభ ఉందనే సీఎం ఆగమై ధాన్యం కోసం కేంద్రం మీద యుద్ధమంటూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.  ప్రతి గింజనూ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వా నిదేనని రేవంత్‌ స్పష్టం చేశారు.

ఫాంహౌస్‌ ముందర కూసుంటం: కేసీఆర్‌ ఫాం హౌస్‌లో 150 ఎకరాల వరి ధాన్యం ఎవరు కొంట రో, రైతులు పండించిన ధాన్యం కూడా అతనే కొనా లని, దాని కోసం రైతులతో కలిసి గుత్ప కట్టెలు పట్టుకుని కేసీఆర్‌ ఫాంహౌస్‌ ముందు కూచుంటా మని రేవంత్‌ చెప్పారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరా ల్లో వరి పండితే, 90 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు వస్తయని, వీటిలో 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనేందుకు చేతకాదా? అని ప్రశ్నించారు.

రైతులపోరు స్ఫూర్తిదాయకం: రైతులు, నిరు ద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వా నికి కనబడటం లేదా? అని రేవంత్‌ ప్రశ్నించారు. మోదీ మెడలు వంచిన పంజాబ్, హర్యానా రైతు లను స్ఫూర్తిగా తీసుకుని ఉమ్మడి నిజామాబాద్‌ రైతులు పోరాడాలని పిలుపునిచ్చారు.  

హరీశ్‌ దగ్గరకి వీహెచ్‌ ఎందుకు పోయిండు?
‘సన్నాసుల చేతుల్లో పావులుగా మారిండ్రు. పార్టీని గౌరవిం చకుంటే పార్టీలో ఉన్నా సచ్చినట్టే’ అని పీసీసీ అధికార ప్రతి నిధి అద్దంకి దయాకర్‌ సభలో ధ్వజమెత్తారు. ‘మంత్రి హరీశ్‌ మా పెద్దమనిషి వీహెచ్‌ను ఎందుకు పిలిచిండో సమాధానం చెప్పాలి’  అని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ షబ్బీర్‌అలీ,  మల్లు రవి పాల్గొన్నారు.

రేవంత్‌ కాన్వాయ్‌కు ప్రమాదం
తూప్రాన్‌: హైదరాబాద్‌ నుంచి కామారెడ్డికి వెళ్తుండగా రేవంత్‌ వాహనం వెనుక వస్తున్న 4 వాహనాలతో కూడిన కాన్వాయ్‌లోకి అకస్మాత్తుగా ఒక ప్రయాణికుడి కారు చేరింది. దీంతో ఆయా కార్ల డ్రైవర్లు ఒక్కసారిగా సడన్‌ బ్రేక్‌లు వేశారు. నాలుగు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొని స్వల్పంగా దెబ్బతిన్నాయి.  ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.  

మరిన్ని వార్తలు