కేంద్ర సంస్థల నుంచి  మీ కంపెనీలకు పనులు వచ్చాయా, లేదా? మీ నాటకం ప్రజలకు తెలిసిపోయింది

7 Aug, 2022 07:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘34 ఏళ్లుగా పనిచేసినా హోంగార్డు ఒక్కోసారి కానిస్టేబుల్‌ కూడా కాలేడు. సివిల్స్‌ రాసి జిల్లా ఎస్పీ అయిన­వాళ్లను పట్టుకుని.. 34 ఏళ్లుగా నేను ఎస్పీ ఆఫీస్‌ దగ్గర ఉన్నా.. నువ్వెట్లా ఎస్పీ అవు తావు అంటే ఎలా ఉంటుంది? ఎవరికైనా అర్హతలను బట్టే పదవులు, హోదాలు వస్తా యి’ అని కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యా­నించారు. రాజకీయాల్లో పరిస్థితులు సందర్భాన్ని బట్టి మారుతుంటాయన్నారు. 2018లో బండి సంజయ్‌ ఎక్కడ ఉన్నారు, ఇప్పుడేమయ్యా రని ప్రస్తావించారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌­లో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..

కేంద్రం నుంచి పనులు వచ్చాయా లేదా?
‘నా ప్రశ్నలకు రాజగోపాల్‌రెడ్డి సమాధా­నా లు చెప్పాలి. జార్ఖండ్‌లో రూ.21 వేల కోట్ల టెండర్‌ పనులు కోల్‌ ఇండియా ద్వారా మీ సంస్థకు వచ్చాయా, లేదా? కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మీకు పనులు రాలేదా? రాష్ట్రంలోని పాలమూరు–రంగారెడ్డి ప్రాజె క్టులో మీకు పనులు వస్తే కొంత పనులు చేశాక ఎక్కువ కమీషన్లు తీసుకొని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు బదిలీ చేశారా లేదా? పార్టీ కార్యక్రమా ల్లో పాల్గొనకుండా.. 2009లో నేరుగా వచ్చి ఎంపీగా నామినేషన్‌ వేశావ్‌. మరి నేరుగా ఓ వ్యాపారస్తుడికి 2009లో బీఫారం ఇచ్చి ఎంపీగా నిలబెట్టినప్పుడు.. 40 ఏళ్లుగా నల్లగొండ జిల్లాలో ఉన్న పార్టీ వారికి అన్యాయం జరగలేదా? బీజేపీలో చేరుతున్న నువ్వు.. మునుగోడులో గత రెండు ఎన్ని­కల్లో పోటీ చేసిన బీజేపీ నేత మనోహ­ర్‌రెడ్డిని ఇప్పుడూ నిలబెడతావా? లేక నువ్వే పోటీ చేస్తావా? ప్రజలకు మీ అసలు రంగు తెలిసిపోయింది.

కష్టకాలంలో పార్టీని వదిలేసి..
కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడి కొట్లాడుతున్నది ఎవరో, వ్యా­పార లావాదేవీల కోసం, రాజకీయ ప్రయో­జనాల కోసం ఎవరు ఎలా వ్యవహ­రిస్తు న్నారో మునుగోడు ప్రజలకు అర్థమై­ంది. ఇప్పుడు మీరు చేరబోయే పార్టీలో కండువా కప్పుకున్న ఒక్కరోజు మాత్రమే పండుగ. రాజగో­పాల్‌రెడ్డిని ఢిల్లీ తీసుకొచ్చిన మాజీ ఎంపీ వివేక్‌ మొహం 3 నెలల తర్వాత అలానే సంతోషంగా ఉంటుందా లేదా చూ­ద్దాం’ అని రేవంత్‌ పేర్కొన్నారు. కోమ­టి రెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయా­కర్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని, దీనిపై పార్టీ తగిన చర్య తీసుకుంటుందని చెప్పారు.
చదవండి: తెలంగాణలో ఉన్నది.. ‘పసుపు కాంగ్రెస్‌’!

మరిన్ని వార్తలు