పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి

27 Jul, 2021 01:18 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి వెంటనే పరిహారం చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సోమ వారం బహిరంగ లేఖ రాశారు.

విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బృందాలను రప్పించి క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయించే సంప్రదాయం గతంలో ఉండేదని గుర్తు చేశారు. తక్షణమే కేంద్ర బృందాలతో పంట నష్టం అంచనా వేయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అటకెక్కించారని, పంటల బీమా అమలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమైనందున బాధిత రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారమివ్వాలని డిమాండ్‌ చేశారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు