అధికార ప్రతినిధులది కీలక పాత్ర

24 Sep, 2021 02:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయాల్లో అధికార ప్రతినిధుల పాత్ర చాలా కీలకమైందని, పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారంతా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌లా పని చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ పార్లమెంట్‌ కార్యాలయంలో గురువారం టీపీసీసీ అధికార ప్రతినిధులతో రేవంత్‌ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అధికార ప్రతినిధులు ముందుండి పని చేయాలని పిలుపునిచ్చారు.

ఇందుకోసం ప్రతీ అంశంపై రోజూ లోతైన అధ్యయనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, వేం నరేందర్‌ రెడ్డి, సురేశ్‌ షెట్కార్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కో ఆర్డినేటర్‌ అయోధ్యరెడ్డి, సీనియర్‌ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, రాజయ్య, హరివర్ధన్‌ రెడ్డి, అధికార ప్రతినిధులు మానవతా రాయ్, సంకేపల్లి సుధీర్‌ రెడ్డి, కల్వ సుజాత, రవళి రెడ్డి, రియాజ్, రామచంద్రారెడ్డి, చారగొండ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగా, దేశంలో విద్యుదుత్పత్తి పెరిగి తక్కువ ధరలకు విద్యుత్‌ లభిస్తున్న సమయంలో రాష్ట్రంలో చార్జీలు తగ్గించాల్సింది పోయి పెంచుతారా అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘విద్యుత్‌ చార్జీల పెంపు మీ అసమర్థ పాలనకు నిదర్శనం కాదా? పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్ను ఆర్టీసీ సంస్థ వెన్ను విరిచిన విషయం వాస్తవం కాదా?’అని గురువారం ట్విట్టర్‌లో నిలదీశారు.

మరిన్ని వార్తలు