-

రేవంత్‌రెడ్డి పాదయాత్ర.. భద్రాచలం ఎంచుకోవడం వెనక కారణాలు

30 Dec, 2022 16:45 IST|Sakshi

జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు రేవంత్ రెడ్డి సిద్దమయ్యారు. అయితే ఈ పాదయాత్ర రేవంత్ రెడ్డి  ఎక్కడి నుంచి మొదలు పెట్టబోతున్నారు...ఆ ఆలయాన్ని రేవంత్ ఎంచుకోవడం వెనక ఉన్న కారణం ఏంటి? పాదయాత్రలో ఎటువంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి.

హాత్ హాత్ సే జోడో యాత్ర లో భాగంగా రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు రేవంత్ రెడ్డి సిద్దమయ్యారు. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర రాహుల్ గాంధీ జోడో యాత్రకు మద్దతుగా సాగనుంది. దేశ వ్యాప్తంగా అన్ని బ్లాక్‌లలో కనీసం రెండు నెలలు పాదయాత్ర చేయాలనేది ఏఐసీసీ ఆదేశాలు. అయితే రేవంత్ రెడ్డి 5 నెలల పాటు పాదయాత్రకు సిద్దమయినట్లు తెలుస్తోంది. యాత్ర పేరుతో ఈ పాదయాత్ర చేయనున్నారు పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఈ పాదయాత్ర లో రేవంత్ రెడ్డి ఓక్కరే చేస్తారా .. లేక పార్టీ నేతలు ఇంకెవరికైనా పాల్గొంటారా అనేది ఇంకా డిస్కషన్ జరుగుతుంది.

పాదయాత్ర రూట్ మ్యాప్ రెండు రోజుల క్రితమే ఫైనల్ చేశారు రేవంత్ రెడ్డి. మొదట్లో జోగులాంబ గద్వాల, భద్రాచలం  ఈ రెండింటి ఓక చోటు నుంచి స్టార్ట్ చేయాలనుకున్నా... చివరకు అన్ని రకాలుగా ఆలోచించి  భద్రాచలం నుంచే పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారట..ఇప్పటికే పాదయాత్ర రూట్ మ్యాప్ ను ఏఐసీసీ కి ఇచ్చారట రేవంత్ రెడ్డి.

ఇక రేవంత్ రెడ్డి భద్రాచలం ఎంచుకోవడం వెనక  కొన్ని ప్రధాన ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాముల వారి గుడి. ఆలయం దగ్గర నుంచి యాత్ర ప్రారంభిస్తే విజయం సిద్దిస్తుందనే ఆలోచన తో భద్రాచలం ను ఎంచుకున్నారట..దీంతో పాటు భద్రాచలం ,ఖమ్మం ఎరియా అంతా కాంగ్రెస్ కు బలమైన కంచుకోట , గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచిన ప్రాంతం.దీంతో యాత్ర  ప్రారంబంలో పాజిటివ్ వేవ్ వస్తే అది యాత్ర మొత్తం కంటిన్యూ అవుతుందనేది రేవంత్ రెడ్డి ఆలోచన గా తెలుస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి భద్రాచలం అభివృద్ధికి సహాకారం రాలేదన్న అభిప్రాయం భద్రాచలం వాసుల్లో ఉంది. దేవాలయ అభివృద్ధి కానీ , రోడ్ల విస్తరణ కానీ ఇంటువంటీ అంశాలు  కేసీఆర్ హామీ ఇచ్చి మర్చిపోయాడనే విమర్శ ఉంది. దీంతో పాటు ఇప్పటి వరకు భద్రాచలంలో టీఆర్‌ఎస్‌ గెలవలేదు.. దీంతో భద్రాచలంను  ఎంచుకోవడమే సరైందని రేవంత్ నిర్ణయించుకున్నారట.

తెలంగాణలో రాహుల్ పాదయాత్ర రూట్‌లో కాకుండా మరోచోట నుంచి పాదయాత్రను ప్రారంభించాలనుకున్నప్పుడు భద్రాచలం నుంచే ప్రారంబించాలని నిర్ణయించారట. దీంతో పాటు భద్రాచలం ఈశాన్యంలో ఉండడం సెంటిమెంట్ అంశంగా రేవంత్ భావిస్తున్నారట. ఇలా అన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ ఉండడం తో పాదయాత్ర భద్రాచలం నుంచి స్టార్ట్ చేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారు.

మరిన్ని వార్తలు