కేసీఆర్‌ నకిలీ లౌకికవాది... 

4 Jul, 2021 09:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక నకిలీ లౌకికవాది అని, ఆయన ప్రధాని మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశాన్ని ఏకతాటిపై ఉంచి అన్ని వర్గాలకు ప్రాధాన్యమివ్వాలనేది కాంగ్రెస్‌ ఆలోచన అయితే, విభజించి పాలించడం బీజేపీ సిద్ధాంతమని విమర్శించారు. ఈనెల 7న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ నివాసంలో ఆయన కాంగ్రెస్‌ మైనార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కేసీఆర్‌ అనేక మైనారిటీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, మైనారీ్టలకు వ్యతిరేకమైన అనేక అంశాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారని రేవంత్‌ దుయ్యబట్టారు. ట్రిపుల్‌ తలాక్‌బిల్లు విషయంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని, అలాగే, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్నార్సీ) బిల్లులను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించలేదని చెప్పారు.

కాంగ్రెస్‌ పలుమార్లు కోరినప్పటికీ సీఏఏ, ఎన్నార్సీ బిల్లులను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయ వైరం ఉన్నట్టు నటిస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేసి ఆ రెండు పారీ్టలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాట తప్పారని, నాలుగు నెలల్లో రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడేళ్లయినా ఇంకా ముస్లింలను మభ్యపెడుతూనే ఉన్నారని మండిపడ్డారు. ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ తన హామీని నిలబెట్టుకుందని, వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా ఈ రిజర్వేషన్లను అమలు చేశామని చెప్పారు. దేశంలో మతతత్వ శక్తులను ఓడించడానికి మైనారీ్టలంతా కాంగ్రెస్‌తో కలసి రావాలని పిలుపునిచ్చారు.  
ఒక్క వాగ్దానాన్నీ 

అమలు చేయలేదు: షబ్బీర్‌ అలీ 
టీఆర్‌ఎస్‌ పార్టీ మైనార్టీలకు ఇచి్చన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆరోపించారు. తన పారీ్టకి అండగా నిలిచారనే కృతజ్ఞత కూడా లేకుండా ముస్లిం సమాజాన్ని, సంస్థలను, ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారని విమర్శించారు.   

మరిన్ని వార్తలు